Chandrababu: జగన్ సీఎం అయిన వెంటనే.. చంద్రబాబు, లోకేష్, ఉమా జైలు యాత్ర చేయాల్సిందే: వైవీ సుబ్బారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు.  

వైయస్ హయాంలో తాను అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. జగన్ సీఎం అయిన వెంటనే చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాల అవినీతిపై విచారణ చేపడతామని... వీళ్లంతా జైలు యాత్ర చేయాల్సిందేనని చెప్పారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లానే అని... జిల్లాలో ఎప్పుడూ కరవు విలయతాండవం చేస్తుంటుందని చెప్పారు. 
Go Back to Shorts
Chandrababu
yv subba reddy
jagan

More Telugu News