Chandrababu: రెండు సార్లు ఎంపీగా గెలిచా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా.. నా అనుభవాన్ని ఎలా తగ్గించి చూపుతారు?: జగన్

  • టీడీపీ, వైసీపీకి వచ్చిన ఓట్లలో తేడా 1.5 శాతం మాత్రమే
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం
  • చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది 

ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీ చరిత్రలోనే ప్రజలకు ఏమీ చేయలేకపోయిన సీఎంగా మిగిలిపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఎవరైనా సరే తన అనుభవాన్ని ఎలా తక్కువ చేసి చూపుతారని ఆయన ప్రశ్నించారు. కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ కాలం గడుపుతున్న తనకు చాలా అనుభవం ఉందని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

2014 ఎన్నికల సమయానికి చంద్రబాబు అధికారంలో లేకపోవడంతో ఆయనపై ప్రజా వ్యతిరేకత లేకపోయిందని జగన్ అన్నారు. దీనికి తోడు సైకిల్ కి రెండు చక్రాల్లా బీజేపీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వ్యవహరించారని చెప్పారు. టీడీపీ, వైసీపీకి వచ్చిన ఓట్లలో తేడా కేవలం 1.5 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కూడా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను తాము పూర్తిగా మార్చివేయబోతున్నామని చెప్పారు. పగలు కాంగ్రెస్ తో, రాత్రి బీజేపీతో టీడీపీ కాపురం చేస్తోందని ఎద్దేవా చేశారు. 

More Telugu News