Andhra Pradesh: తూర్పున వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ ఎమ్మెల్సీ కందుల గుడ్‌బై!

  • తూర్పుగోదావరిలో వైసీపీకి ఎదురుదెబ్బలు
  • ఇప్పటికే వీడిన ద్వితీయ శ్రేణి నేతలు
  • నేడు రాజీనామాను ప్రకటించనున్న కందుల దుర్గేశ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్‌పై జగన్ ఇటీవల నోరు జారడం, కాపు రిజర్వేషన్ల విషయంలో యూటర్న్ తీసుకోవడం వల్లే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు దుర్గేశ్ కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉండడం జిల్లాలోని వైసీపీ శ్రేణులను వేధిస్తోంది.

రాజమహేంద్రవరం రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్న దుర్గేశ్ ప్రస్తుతం వైసీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, తాను టికెట్ ఆశిస్తుండగా జగన్ మాత్రం ఆకుల వీర్రాజుకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతోనే దుర్గేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరోపక్క తెలుస్తోంది. నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News