Atal Bihari Vajpayee: చితి మంటల్లో వాజ్ పేయి.. తాతయ్యను చూసి విలపించిన నిహారిక!

  • వాజపేయి అంతిమ యాత్రలో పాల్గొన్న లక్షలాదిమంది ప్రజలు
  • స్మృతిస్థల్‌‌ లో వాజపేయి అంత్యక్రియలు
  •  చితికి నిప్పంటించగానే వెక్కి వెక్కి ఏడ్చిన మనవరాలు నిహారిక
భువి నుండి దివికేగిన ధృవతార వాజ్ పేయికి లక్షలాది మంది ప్రజలు కడసారి వీడ్కోలు పలికారు. వాజ్ పేయికి అందరికంటే అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన దత్త పుత్రిక నమిత కూతురైన నీహారిక మాత్రం అప్పటి దాకా విషణ్ణవదనంతో వుండి, చితికి నిప్పంటించగానే వెక్కి వెక్కి ఏడ్చింది.

నిహారికకు వాజ్ పేయితో ఉన్న అనుబంధం అలాంటిది. ఇంట్లో వీరిద్దరినీ చూసిన ప్రతి ఒక్కరు వారి మధ్య పెనవేసుకున్న స్నేహానికి ముచ్చటపడేవారు. కలిసి పుస్తకాలు చదవడం, వాటిపై చర్చించుకోవడం, ఆటలు ఆడటం, సినిమాలు చూడటం చేసేవారు. అంత గొప్ప వ్యక్తి, తనను చాలా ప్రేమగా చూసుకున్న వ్యక్తి దూరమవ్వడంతో నిహారిక తట్టుకోలేకపోయింది. దాంతో ఒక్కసారిగా దుఃఖం ఉబికి రావడంతో ఆమె పెద్దగా విలపించింది. నిహారిక విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది.       
 
Atal Bihari Vajpayee
BJP

More Telugu News