vajpayee: పార్థివ దేహంపై కప్పిన త్రివర్ణ పతాకం మనవరాలికి అందజేత!

  • వాజ్ పేయి దత్తపుత్రిక నమిత కూతురు నిహారిక
  • నిహారిక అంటే వాజ్ పేయికి ఎంతో ఇష్టం
  • అటల్ ఆరోగ్యం క్షీణించినప్పుడు వెన్నంటి ఉన్న మనవరాలు 
ప్రభుత్వ లాంఛనాలతో  అటల్ బిహారి వాజ్ పేయి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా వాజ్ పేయి పార్ధివదేహంపై త్రివర్ణ పతాకం కప్పారు. లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం, ఆయనపై కప్పిన త్రివర్ణపతాకాన్ని ఆయన దత్తపుత్రిక నమిత కూతురు, నీహారికకు అందజేశారు.

 వాజ్ పేయికి నీహారిక అంటే ఎంతో ఇష్టం. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆయన పక్కన ఎంతటి గొప్పవాళ్లున్నా సరే, తాత దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన ఒడిలో చిన్నారి నిహారిక కూర్చునేదట. వాజ్ పేయి ఎంత ఒత్తిడిలో ఉన్నా తన మనవరాలిని చూడగానే సంతోషపడేవారట. ఆమెతో కలిసి వాజ్ పేయి క్రికెట్ ఆడటం, సినిమాలు చూడటం చేసేవారట. వాజ్ పేయి ఆరోగ్యం క్షీణించి పదేళ్ల పాటు వీల్ చైర్ కే పరిమితమైనప్పుడు నిహారిక ఆయన్ని వెన్నంటి ఉండేదట.
vajpayee
Niharika

More Telugu News