vijay devarakonda: 25 కోట్లకి పైగా వసూలు చేసిన 'గీత గోవిందం'

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలిరోజున 16 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. రెండో రోజుతో కలుపుకుని ఈ సినిమా 25 కోట్లకి పైగా గ్రాస్ ను .. 15.70 కోట్ల షేర్ ను రాబట్టింది.

విజయ్ దేవరకొండ కెరియర్లో అత్యధిక వసూళ్లు ఇవేనని చెబుతున్నారు. ఇక శుక్ర .. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 50 కోట్ల మార్కును తేలికగా అందుకుంటుందని చెబుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 15 కోట్లకు అమ్మారు. రెండు రోజుల్లోనే 15.70 కోట్ల షేర్ ను రాబట్టడంతో సినిమా లాభాల బాట పట్టినట్లయింది. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ .. యూత్ కి కనెక్ట్ అయ్యే కథాకథనాలు .. అలరించే సంగీతం .. ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు.               
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News