AB Vajpayee: వాజ్‌పేయి మృతికి సంతాప సూచకంగా సెలవు ప్రకటించిన 16 రాష్ట్రాలు

  • గురువారం కన్నుమూసిన మాజీ ప్రధాని
  • ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
  • స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు

బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాప సూచకంగా 16 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయబోవని స్పష్టం చేశాయి.  గత రెండు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం సాయంత్రం 5:05 గంటలకు అస్తమించారు. ఆయన మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

రాజకీయ దురంధురుడి మృతికి సంతాపంగా మొత్తం 16 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. వాటిలో గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హరియాణా, గోవా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలు, కార్యాలయాలు మూతపడనున్నాయి. కాగా, వాజ్‌పేయి మృతికి తాము కూడా సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రకటించాయి.

More Telugu News