Atal Bihari Vajpayee: వాజ్‌పేయి కోల్‌కతాకు వస్తే ఆ ఇంట్లోనే బస చేసేవారట!

  • కోల్‌కతా కు చెందిన ఘన్‌శ్యామ్‌ బెరివాల్‌ కుటుంబంతో సాన్నిహిత్యం
  •  స్నేహశీలి, మృదు స్వభావిని కోల్పోయామన్న స్నేహితుడు
  •  ప్రధానిగా ఉన్నా మా ఇంట్లోనే భోజనం, బస చేశారన్న ఘన్‌శ్యామ్‌

గొప్ప స్నేహ శీలి, సుహృద్భావం కలిగిన వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి అని చెప్పటానికి నిజమైన తార్కాణం అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం. కోల్‌కతాలోని ఓ కుటుంబంతో ఆయన సాన్నిహిత్యం ఆయనలోని నిరాడంబరతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈరోజు ఆ మహనీయుడు ఈ లోకాన్ని వీడి వెళ్ళినా జన హృదయాల్లో ఆయన నిలిచే వున్నారు. ఆయన స్నేహాన్ని గుర్తు చేసుకుని కోల్‌కతాకు చెందిన ఘన్‌శ్యామ్‌ బెరివాల్‌ కన్నీటి పర్యంతం అయ్యారు.

 భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి ఘన్‌శ్యామ్‌ బెరివాల్‌ కుటుంబంతో కొన్ని దశాబ్దాల క్రితం పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. అప్పటి నుండి వాజపేయి, ఘన్‌శ్యామ్‌ బెరివాల్‌ చాలా సన్నిహితంగా ఉండేవారు. ప్రధాని అయిన తరువాత కూడా ఆ స్నేహం కొనసాగింది. వారింటికి వెళ్ళటం, భోజనం చెయ్యటం, అక్కడ బస చెయ్యటం చేసేవారని   వాజ్‌పేయీతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఘన్‌శ్యామ్‌ బెరివాల్‌ కుటుంబం.

కోల్‌కతాలోని చిత్తరంజన్‌ అవెన్యూ ప్రాంతంలో నివసించే వారింటికి వాజ్ పేయి చెప్పకుండా కూడా వచ్చే వారని, పానీపూరీ తినేవారని, అప్పుడప్పుడు సినిమాలు కూడా చూసేవారని తమ ఇంట్లో వండిన ప్రతీదీ ఇష్టంగా తినేవారని, ఆహారం విషయంలో మాత్రం ఆయన కొన్ని జాగ్రత్తలు పాటించేవారని చెప్పారు. 'వాజ్‌పేయి బిహార్‌, ఒడిశాలకు ఎప్పుడు వెళ్లినా కోల్‌కతా మీదుగానే వెళ్లేవారు. ఆ సమయంలో మా ఇంటికి వచ్చేవారు. చెప్పకుండానే వచ్చి ఆశ్చర్యపరిచేవారు. గొప్ప స్నేహశీలిని కోల్పోయాం' అంటూ ఘన్‌శ్యామ్‌ బెరివాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News