modi: వాజ్ పేయి మృతిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం

  • అటల్ జీ మృతి నన్ను ఎంతో కలచి వేసింది: కోవింద్
  • యావత్తు దేశం శోక సంద్రంలో మునిగిపోయింది
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలి: నరేంద్ర మోదీ

బీజేపీ అగ్రనేత వాజ్ పేయి మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తమ సంతాపం వ్యక్తం చేశారు. అటల్ జీ ఇకలేరన్న వార్త తమనెంతో కలచివేసిందని, ఆయన కన్నుమూత దేశప్రజలకు తీరనిలోటని అన్నారు.

యావత్తు దేశం శోక సంద్రంలో మునిగిపోయింది

ప్రియతమ నేత వాజ్ పేయి మృతితో యావత్తు దేశం శోక సంద్రంలో మునిగిపోయిందని నరేంద్ర మోదీ అన్నారు. దేశం కోసమే జీవించిన వాజ్ పేయి, దశాబ్దాల పాటు సేవలందించారని కొనియాడారు. ఈ సంఘటనతో బీజేపీ కార్యకర్తలు, లక్షలాది మద్దతుదారులు విషాదంలో మునిగిపోయారని అన్నారు. వాజ్ పేయి మరణం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేని నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్ పేయితో తనకు మర్చిపోలేని జ్ఞాపకాలు కోకొల్లలు ఉన్నాయని, తన లాంటి కార్యకర్తలకు ఆయన ఎంతో స్ఫూర్తి దాయకమని అన్నారు. వాజ్ పేయి ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శనం ప్రతి భారతీయుడికి అండగా ఉంటాయని, ఆయన ఆత్మకు శాంతి కలగాని ఈశ్వరుణ్ని ప్రార్థిస్తున్నానని మోదీ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

More Telugu News