amit shah: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తడబాటు.. నేలకొరిగిన జాతీయ జెండా!

  • నేలపై పడిపోయిన జాతీయ పతాకం
  • అనంతరం మరోవైపుకు తిరిగి సెల్యూట్ చేసిన బీజేపీ చీఫ్
  • మండిపడుతున్న నెటిజన్లు
సాత్వంత్ర్య దినోత్సవం వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తడబడ్డారు. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జాతీయ జెండా ఎగరవేసే సందర్భంలో తాడును సరిగ్గా పట్టుకోకపోవడంతో జాతీయ జెండా పై నుంచి ఒక్కసారిగా నేలపై పడిపోయింది. వెంటనే తేరుకున్న షా జెండాను పైకి లాగారు. అనంతరం అక్కడి అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన షా.. అనంతరం జెండా ఇవతల ఉంటే మరోవైపుకు తిరిగి సెల్యూట్ చేశారు.

జెండా నేలపై పడిపోవడంతో అప్పటివరకూ మాట్లాడుతున్న డీడీ న్యూస్ యాంకర్లు సైలెంట్ అయిపోయారు. షా కార్యక్రమం డిజాస్టర్ గా మారిందని యాంకర్లు గొణిగారు. కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తనను ఆవిష్కరించే అర్హత అమిత్ షాకు లేకపోవడంతోనే జాతీయ జెండా నేలకొరిగిందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, దేశాన్ని బీజేపీ ఏ గతి పట్టించిందో తెలుసుకోవడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు దీని వెనకాల కూడా నెహ్రూ కుట్ర ఉందని చెప్పండి అని ఎద్దేవా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

amit shah
BJP
head quarters
national flag
dis respect

More Telugu News