vijay devarakonda: విజయ్ దేవరకొండను 25 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారట!

  • ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన డైరెక్టర్ పరశురామ్
  • అర్జున్ రెడ్డి కంటే ముందే విజయ్ సినిమా తీయాలనుకున్నా
  • కానీ.. అతనితో నటించేందుకు హీరోయిన్లు ముందుకు రాలేదు
'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగింది. విజయ్ సినిమా కోసం యూత్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈరోజు విడుదలైన 'గీత గోవిందం' సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన నటించింది. సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

'అర్జున్ రెడ్డి' సినిమాకంటే ముందే విజయ్ దేవరకొండతో సినిమా తీసేందుకు తాను సన్నాహకాలు చేసుకున్నానని పరశురామ్ తెలిపాడు. అప్పటికి విజయ్ కు అంత గుర్తింపు లేదని... దీంతో, అతనితో కలసి నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపలేదని అన్నాడు. దాదాపు 25 మంది హీరోయిన్లు విజయన్ ను రిజెక్ట్ చేశారని తెలిపాడు.
vijay devarakonda
parasuram
rashmika mandana

More Telugu News