naranayana rao: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నేను, రజనీకాంత్ క్లాస్ మేట్స్!: సీనియర్ నటుడు నారాయణరావు

  • సినిమా వాతావరణంలో పుట్టిపెరిగాను 
  • నటన పట్ల ఆసక్తి ఎక్కువగా వుండేది 
  • చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాను    

కేరక్టర్ ఆర్టిస్ట్ గా నారాయణరావుకి మంచి గుర్తింపు వుంది. ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ఆయన ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఆ తరువాత ధారావాహికలలోను ఆయన నటిస్తూ వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ .. కొన్ని వందల సినిమాలకి ఆయన డిస్ట్రిబ్యూటర్ గా చేశారు. అప్పట్లో అన్నపూర్ణ పిక్చర్స్ లోను మా నాన్న భాగస్వామిగా ఉండేవారు. అలా నేను సినిమా వాతావరణంలోనే పుట్టిపెరిగాను.

చిన్నప్పటి నుంచి నాకు నటనపట్ల ఆసక్తి ఉండేది. పదకొండు .. పన్నెండు సంవత్సరాల వయసులో మొదటిసారిగా నేను 'శకుంతల' నాటకంలో మేనక వేషం వేశాను. ఆ తరువాత నేను భరతనాట్యం నేర్చుకుని చెన్నై వెళ్లాను. అక్కడి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండు సంవత్సరాల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాను. అక్కడ నేను .. రజనీకాంత్ క్లాస్ మేట్స్. అక్కడికి ఎగ్జామినర్ గా వచ్చిన బాలచందర్ గారు నన్ను .. రజనీకాంత్ ను చూసి, 'అంతులేని కథ'లో మాకు అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News