ntr: 'అరవింద సమేత' టీజర్ రిలీజ్ కి టైమ్ ఫిక్సయింది!

  • షూటింగు దశలో 'అరవింద సమేత'
  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ 
  • అక్టోబర్ 11వ తేదీన విడుదల       

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ లోగా ఈ నెల 15వ తేదీన ఫస్టు టీజర్ ను విడుదల చేయాలనుకున్నారు.

తాజాగా టీజర్ ను రిలీజ్ చేసే సమయాన్ని ఫిక్స్ చేశారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా .. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా త్రివిక్రమ్ ఈ టీజర్ ను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, జగపతిబాబు .. నాగబాబు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.      

More Telugu News