వైజాగ్ లో 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ ఫంక్షన్
Add ap7am to your home Screen

వైజాగ్ లో 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ ఫంక్షన్

  • పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం'
  • ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 15వ తేదీన భారీస్థాయిలో సినిమా రిలీజ్       
ఇప్పుడు యూత్ లో విజయ్ దేవరకొండకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులంతా 'గీత గోవిందం' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ లోగా .. అంటే ఈ నెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. వైజాగ్ .. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లోని సర్ సి.ఆర్. రెడ్డి కాన్వొకేషన్ హాల్ లో ఈ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. పోస్టర్స్ స్థాయి నుంచే ఈ సినిమా యూత్ ను తన వైపుకు తిప్పుకుంది. ఇక టీజర్లు .. ట్రైలర్లు .. సాంగ్స్ మరింత ఆసక్తిని .. అంచనాలను పెంచేశాయి. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో భారీ హిట్ చేరనుందనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.     
vijay devarakonda
rashmika

More Telugu News