karunanidhi: న్యాయపోరాటం చేసి కరుణానిధిని ఖననం చేసే స్థలాన్ని సాధించాం: స్టాలిన్

  • కార్యకర్తలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి
  • అంతిమ సంస్కారాలు శాంతియుతంగా సాగేలా చూడాలి
  • అభిమానులు, కార్యకర్తలకు స్టాలిన్ విజ్ఞప్తి

మెరీనా బీచ్ లో కరుణానిధిని ఖననం చేసేందుకు ప్రభుత్వం మొండికేసిందని, న్యాయపోరాటం చేసి ఖననం చేసే స్థలాన్ని సాధించామని డీఎంకే అగ్రనేత స్టాలిన్ అన్నారు. కరుణానిధి అంతిమసంస్కారాలు శాంతియుతంగా సాగేలా అభిమానులు, తమ కార్యకర్తలు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. డీఎంకే కార్యకర్తలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

 కాగా, రాజాజీ హాలు నుంచి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా కొనసాగనుంది. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. 

More Telugu News