rajanikanth: భారీ యాక్షన్ సీన్స్ పూర్తి చేసిన రజనీ!

  • రజనీతో కార్తీక్ సుబ్బరాజ్ 
  • కథానాయికగా సిమ్రాన్ 
  • కీలకపాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ  

రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' .. 'కాలా' సినిమాలను చకాచకా పూర్తిచేసిన రజనీకాంత్, అదే స్పీడ్ తో కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను చేస్తున్నారు. 25 రోజులుగా ఈ సినిమా డార్జిలింగ్ లో షూటింగు జరుపుకుంటోంది. రజనీకాంత్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో జరుపుతూ వచ్చారు. తాజాగా ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

 రజనీ కెరియర్లోనే డిఫరెంట్ గా వుండేలా ఈ యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయించారట. సినిమా హైలైట్స్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. రజనీ అభిమానుల టేస్టును దృష్టిలో పెట్టుకుని కార్తీక్ సుబ్బరాజ్ ఈ సన్నివేశాల చిత్రీకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సిమ్రాన్ నటిస్తుండగా, విజయ్ సేతుపతి .. బాబీ సింహా .. ఫహాద్ ఫాజిల్ .. నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.   

More Telugu News