Chennai: మాజీ సీఎంలకు మెరీనా బీచ్ లో చాన్స్ లేదు... ఆపై మీ ఇష్టం: హైకోర్టులో తమిళ సర్కారు తుది వాదన

  • సీఎంలుగా ఉండి మరణిస్తేనే గతంలో స్థలం
  • కామరాజ్ నాడార్ అంత్యక్రియలను గుర్తు చేసిన ప్రభుత్వం
  • మరికాసేపట్లో తుది తీర్పు ఇవ్వనున్న మద్రాస్ హైకోర్టు

తమిళనాడులో ముఖ్యమంత్రులుగా పనిచేస్తూ మరణించిన వారికి మాత్రమే మెరీనా బీచ్ లో స్థలాన్ని కేటాయించారని, మాజీ సీఎంలు మరణిస్తే, మెరీనా బీచ్ లో అంత్యక్రియలను గతంలో జరపలేదని ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో తన తుది వాదనను వినిపించింది. అక్కడే అంత్యక్రియలు చేయాలని ధర్మాసనం భావిస్తే, అంగీకరిస్తామని, ఆ తరువాత ఇబ్బందులు వచ్చాయని తమను నిందించవద్దని పేర్కొంది.

పలు పర్యావరణ అంశాలు, తీర ప్రాంత నిబంధనలు ముడిపడివున్న ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమేనని చెప్పింది. కామరాజ్ నాడార్ మరణించిన సమయంలో డీఎంకే అధికారంలో ఉందని, అప్పట్లో ఆయన అంతిమ సంస్కారాలను మెరీనా బీచ్ లో చేయలేదని తెలిపింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు అధికారంలో ఉండి కన్నుమూసినందునే స్థలం కేటాయించామని వాదించింది. ఈ కేసులో కోర్టు తీర్పు మరికాసేపట్లో వెల్లడి కానుంది.

More Telugu News