ఈ ఒక్కరోజూ నాన్నా అని పిలువనా?: స్టాలిన్ భావోద్వేగానికి డీఎంకే కార్యకర్తల కన్నీరు
- పుట్టినప్పటి నుంచి నాయకుడిగానే చూశాను
- ఈ ఒక్కసారీ నాన్నా అని పిలవనా?
- తనలోని బాధను పంచుకున్న స్టాలిన్
"ఇంతవరకూ గడిపిన నా జీవితంలో మీరు ఓ నేతగానే నాకు తెలుసు" అని కరుణానిధి ఆరుగురు వారసుల్లో ఒకరైన స్టాలిన్ తన కవితలో వ్యాఖ్యానించారు. కన్నీటితో తానిప్పుడు రాస్తున్నానని, ఇకపై ఇంట్లో మీ నవ్వు కనిపించదన్న సంగతి తలచుకోవడానికే భయపడుతున్నానని ఆయన తనలోని బాధను చెప్పుకున్నారు. కాగా, కరుణానిధిలానే ఆయన రాజకీయ వారసుడైన స్టాలిన్ కు కూడా కవిత్వంపై మంచి పట్టుంది.