pd account: ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న పీడీ అకౌంట్స్.. ఇంతకీ అసలు పీడీ అకౌంట్ అంటే ఏమిటి?

  • పీడీ అకౌంట్ అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్
  • శాఖలు, సంస్థల పేర్లతోనే ఈ ఖాతాలు ఉంటాయి
  • వ్యక్తిగత పేర్లతో ఈ అకౌంట్లు ఉండవు

పీడీ అకౌంట్ల ద్వారా ఏపీలో భారీ స్కామ్ జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇది 2జీ స్కామ్ కన్నా పెద్దదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పీడీ అకౌంట్స్ అంటే ఏమిటనే సందేహం పలువురిలో నెలకొంది. ఈ అకౌంట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏపీ ఫైనాన్షియల్ కోడ్ చాప్టర్ 9లో పేర్కొన్న సివిల్ డిపాజిట్లలో పర్సనల్ డిపాజిట్ (పీడీ) అకౌంట్స్ ఒక భాగం. ఏపీఎఫ్సీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖలు, సంస్థల పేర్లతో ఈ ఖాతాలు ఉంటాయి. శాఖలు, సంస్థల పేర్లతోనే ఈ ఖాతాలను నిర్వహిస్తారే తప్ప, వ్యక్తుల పేర్లతో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఆయా విభాగాలకు చెందిన హెడ్ ఈ అకౌంట్లను నిర్వహిస్తారు. వారిని పీడీ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ అంటారు.

ప్రభుత్వ బడ్జెట్ లో కేటాయించిన డబ్బు, ఆదాయం ఇదంతా పీడీ అకౌంట్ లో జమ అవుతుంది. అవసరాలను బట్టి ఈ అకౌంట్ లోని నిధులను వాడుకుంటారు. పీడీ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిధులను వాడుకోవచ్చు. ట్రెజరీకి వెళ్లి, బిల్లులు పెట్టి డబ్బులు తీసుకోవాల్సిన ఇబ్బంది ఇక్కడ లేకపోవడంతో... సాధారణంగా ఈ అకౌంట్లలో ఎక్కువ డబ్బును పెడుతుంటారు. మరిన్ని వివరాల కోసం ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీడియో చూడండి.

More Telugu News