ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం.. ఆపై భయంతో నదిలో దూకి యువకుడి ఆత్మహత్య!
- డ్రెంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకుడు
- తల్లిదండ్రులను తీసుకురావాలన్న పోలీసులు
- కేసు నమోదు చేస్తారన్న భయంతో ఆత్మహత్య
పోలీసుల హెచ్చరికలతో భయపడిన యువకుడు తనపై కేసు నమోదు చేస్తారేమోనని భావించాడు. దీంతో మనస్తాపంతో అక్కడే వంతెనపై నుంచి అడయారు నదిలోకి దూకేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు రోజుల గాలింపు అనంతరం సోమవారం ఉదయం రాధాకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.