Goa: భారత ఫైటర్ జెట్ తో పోటీ పడిన లాంబోర్గిని కారు... వీడియో!

  • గోవాలోని దంబోలిన్ ఎయిర్ పోర్టులో ఘటన
  • ప్రత్యేక అనుమతి ఇచ్చిన నేవీ అధికారులు
  • పక్కపక్కనే దూసుకెళ్లిన జెట్ విమానం, కారు

ఇది 44 సెకన్ల వీడియో. భారత నావికాదళంలో కీలకమైన యుద్ధ విమానంగా సేవలందిస్తున్న మిగ్-29కేతో ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న లగ్జరీ కార్ మేకర్ లాంబోర్గినీ తయారు చేసిన కారు ఒకటి పోటీ పడింది. జెట్ తో సమానమైన వేగంతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. గోవాలోని దంబోలిన్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అయితే, కారుతో పోలిస్తే జెట్ వేగంగా వెళ్లి గాల్లోకి ఎగిరింది.

'ఆటో వరల్డ్' మేగజైన్ కోసం ఈ వీడియోను షూట్ చేశారు. ఇండియన్ నేవీలో చేరాలని యువత మనసులో బలమైన కోరిక ఏర్పడేలా చూసేందుకు నేవీ అధికారులు ఈ షూట్ కు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు తదుపరి 'ఆటో వరల్డ్' మేగజైన్ లో ప్రచురితమవుతాయని సమాచారం. జెట్ విమానంతో పోటీపడుతున్న కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News