Rana: రియల్ చంద్రబాబును కలిసిన 'రీల్' చంద్రబాబు!

  • క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్
  • చంద్రబాబును కలిసిన రానా
  • ఏపీలో సినీ టూరిజం అభివృద్ధి
  • కొత్త విధానం తెస్తామన్న చంద్రబాబు

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ రియల్ చంద్రబాబును రీల్ చంద్రబాబు రానా కలిశారు. 'ఎన్టీఆర్'లో చంద్రబాబుగా నటించేందుకు రానా అంగీకరించినట్టు వస్తున్న వార్తలకు ఈ భేటీ మరింత బలం చేకూర్చింది. అమరావతి ఎంతో ఆకట్టుకునేలా ఉందని, సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు అమరావతి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రానా వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, సినీ టూరిజం పేరిట కొత్త తరహా ఆకర్షణను ప్రోత్సహించవచ్చన్న ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందిస్తామని అన్నారు. సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు సహకరించాలని చంద్రబాబు కోరారు. 

More Telugu News