supreme court: రాష్ట్ర విభజనపై మరో రెండు పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు

  • గిడుగు రుద్రరాజు, చలసాని శ్రీనివాస్ ల పిటిషన్లను స్వీకరించిన ధర్మాసనం
  • నాలుగు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలంటూ ఆదేశం
  • అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామన్న సుప్రీం

ఏపీ విభజన అంశాలకు సంబంధించి పలువురు సుప్రీంకోర్టుకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు, చలసాని శ్రీనివాస్ లు వేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా నాలుగు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలను ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపింది. విభజన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

More Telugu News