jena sena: ఉమ్మడి కార్యాచరణతో ప్రజా సమస్యలపై పోరాడనున్న ‘జనసేన’, వామపక్షాలు

  • హైదరాబాద్ లో పవన్ తో వామపక్ష నేతల భేటీ
  • అమరావతి నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు
  • త్వరలో విజయవాడలో మరోమారు సమావేశం

 భూ సేకరణ, భూనిర్వాసితులకు పునరావాసంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రత్యేక హోదా సాధన, యువత, విద్యార్థుల సమస్యలపై కలిసి పోరాడాలని జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో వామపక్ష పార్టీల నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఉమ్మడి కార్యాచరణతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని జనసేన, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ సమావేశంలో ఖండించారు. అవసరం లేకున్నా భూసేకరణకు ప్రకటనలు జారీ చేసినా, బలవంతపు భూ సేకరణకు దిగినా తప్పకుండా నిరసన తెలిపి పోరాటం చేయాలని నిర్ణయించాయి.  

అనంతరం, జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ క‌న్వీన‌ర్ మాదాసు గంగాధ‌ర్ మాట్లాడుతూ, తమతో కలిసి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పలు ప్రజా సమస్యలపై, సర్కార్ వైఫల్యాలపై స్పందించాయి. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ఈ పోరాటాలు చేయడంపై మరోసారి విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమే కాదు, పరిష్కారం దిశగా కూడా వెళ్లాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకమంటూ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.  

More Telugu News