bichagadu: 'బిచ్చగాడు' హీరోయిన్ తల్లి అయింది!

  • బిచ్చగాడు సినిమాలో ఆకట్టుకున్న సాద్నా
  • డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ను పెళ్లాడిన యువనటి
  • పండటి బిడ్డకు జన్మనిచ్చిన సాద్నా
తమిళ సినిమా 'పిచ్చైకారన్' తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన నటించిన యువనటి సాద్నా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, కెరీర్ ప్రారంభదశలో ఉండగానే సినీ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ను పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది ఆమె.

సినిమాల కంటే తనకు కుటుంబమే ముఖ్యమని ఆమె చాలా సార్లు చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తమ బిడ్డకు పేరు పెట్టే వేడుకను ఘనంగా నిర్వహించాలని సాద్నా, కార్తీక్ దంపతులు భావిస్తున్నారట. 
bichagadu
heroine
sadna
mother

More Telugu News