Roja: రోజుకో మాట చెబుతూ ఇంత మోసమా?: చంద్రబాబుపై రోజా ఫైర్

  • అన్ని విభజన హామీలపై మాట మారుస్తున్న సీఎం
  • బీజేపీతో లాలూచీ పడి ప్రజల వంచన
  • ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్న రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ జోన్, కడప ఉక్కు కర్మాగారాలు సహా అన్ని హామీలపై రోజుకో మాట మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె, బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడి, ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని, స్వార్థ రాజకీయాలకు పాల్పడి రాయలసీమ అభివృద్ధిని అణగదొక్కుతున్నారని అన్నారు.

 తిరుమలలో జరుగుతున్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీని తేవడానికి చంద్రబాబు అంగీకరించడం లేదని, ఈ విషయంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని రోజా తెలిపారు. దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న అన్ని అంశాలూ పారదర్శకంగా ఉండాలని, భక్తులకు సమాచారం ఇచ్చేందుకు టీటీడీకి అభ్యంతరం ఎందుకని ఆమె ప్రశ్నించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని రోజా డిమాండ్ చేశారు.
Roja
YSRCP
Chandrababu
Tirupati
Tirumala
TTD

More Telugu News