Green Challenge: గౌతమ్, సితారలను చూసి గ‌ర్విస్తున్నాను: మ‌హేష్ బాబు

  • గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించిన టాలీవుడ్ ప్రిన్స్
  • మొక్కలు నాటిన గౌతమ్, సితార
  • ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న మహేష్ బాబు
ఇటీవల కేటీఆర్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటి తన కుమారుడికి, కుమార్తెకు చాలెంజ్ ని ఫార్వార్డ్ చేసిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో ఆనందిస్తున్నాడు. తన చాలెంజ్ ని తీసుకుని మొక్కలు నాటిన కొడుకు గౌతమ్, కూతురు సితారలను అభినందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టాడు.

మొక్కలు నాటుతున్న వీడియోను ఈ ఉదయం 6 గంటల సమయంలో మహేష్ షేర్ చేసుకోగా, ఇప్పటికే 65 వేల మంది దీనిని చూశారు. 22 వేల మందికి పైగా లైక్ చేశారు. తన పిల్లలను చూస్తుంటే గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగమై భవిష్యత్తును పచ్చదనంగా మార్చాలని ఈ సందర్భంగా మహేష్ కోరాడు.
Green Challenge
Tollywood
Mahesh Babu
KTR
Gautam
Sitara

More Telugu News