నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ పై ప్రజల దాడి.. ఎస్సైకు తీవ్ర గాయాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ పై ప్రజల దాడి.. ఎస్సైకు తీవ్ర గాయాలు!

  • హరిజనవాడకు చెందిన జోసెఫ్ కు బాకీపడ్డ ముగ్గురు
  • ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో విచారించిన ఎస్సై
  • మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎస్సైపై దుర్భాషలు 
నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడి చేశారు. స్టేషన్లో ఉన్న ఎస్సై పాటు ముగ్గురు కానిస్టేబుళ్ల పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రాణభయంతో సెల్ లో దాక్కున్న ఎస్ఐను బయటకు లాక్కొచ్చి మరీ దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణరావును, కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, రాపూర్ హరిజనవాడకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ అనే ముగ్గురు వ్యక్తులు బాకీ ఉన్నారు. వారు బాకీ చెల్లించకపోవడంతో జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ముగ్గురినీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తుండగా... మద్యం మత్తులో ఉన్న పిచ్చయ్య ఎస్సైను దుర్భాషలాడాడు. దీంతో, మెడికల్ చెకప్ కోసం పిచ్చయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వారి బంధువులు స్టేషన్ వద్దకు వచ్చి, వీరంగం వేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి చేశారు. 

సుమారు మూడు వందల మందికి పైగా స్టేషన్ పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న ఉన్నత పోలీస్ అధికారులు అదనపు పోలీస్ బలగాలను రాపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు పంపించారు.
nellore
rapur

More Telugu News