నరేంద్ర మోదీనే కాదు.. ఎవర్నీ పిలవలేదు!: ఇమ్రాన్ ఖాన్ పార్టీ వివరణ
- 11న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం
- ఏ దేశాధినేతనూ ఆహ్వానించలేదన్న పీటీఐ
- విదేశాంగ శాఖ సలహా ప్రకారం నిర్ణయమన్న ఫవాద్ చౌదరి
కాగా, పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించిన తరువాత విదేశీ దేశాధినేతలను ఆహ్వానించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే సార్క్ దేశాధినేతలను తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారని, ఆ జాబితాలో మోదీ కూడా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.