విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుంది: కంభంపాటి హరిబాబు ధీమా
- గోయల్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
- త్వరలోనే విశాఖకు రైల్వే జోన్
- చిత్తశుద్ధిని శంకించొద్దన్న హరిబాబు
మరోవైపు, బీజేపీ పార్లమెంటరీ భేటీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఏపీ అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.