ఆ పాటలో రామారావుగారు నిజంగానే ఏడ్చేశారు: ముచ్చర్ల అరుణ
- రామారావుగారితో 'జస్టిస్ చౌదరి' చేశాను
- ఆయనను నాన్నగారు అని పిలిచేదానిని
- ఆయనతో కలిసి నటించడం అదృష్టం
అది ఎంత మంచి సాంగ్ అంటే .. ఆ పాటలో ఎన్టీ రామారావుగారు నిజంగానే ఏడ్చేశారు .. నిజంగానే నేను కూడా ఏడ్చేశాను. ఆ పాటలోని అర్థం అలా వుంటుంది .. అందుకే అంతలా ఎమోషనల్ అయ్యాము. షూటింగు గ్యాప్ లో రామారావుగారు ఎంతో ఆత్మీయంగా వుండేవారు. నేను కూడా ఆయనని 'నాన్నగారు' అనే పిలిచే దానిని. నటన పట్ల ఎంతటి అంకితభావం కలిగి ఉండాలనేది ఆయన చెప్పేవారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.