భారతీరాజా నన్ను ఫాలో అవుతూ.. మా ఇంటికి వచ్చేశారు!: ముచ్చర్ల అరుణ
- డాన్స్ అకాడమీలో భారతీరాజా నన్ను చూశారు
- నా వెనుకే మా ఇంటికి వచ్చారు
- తన సినిమాలో హీరోయిన్ గా చేయమన్నారు
ఆ తరువాత నన్ను ఫాలో అవుతూ మా ఇంటికి వచ్చారు. ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా చేయమని అడిగారు. 'నటనలో నాకు ఏబీసీడీలు కూడా తెలియవు .. చేయను' అన్నాను. 'ఆలోచించుకుని చెప్పండి' అనేసి వాళ్లు చెన్నై వెళ్లిపోయారు. మా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్లు మళ్లీ వచ్చి అడిగారు. ఇది మంచి అవకాశం .. ప్రయత్నించి చూడమని మా కజిన్ అనడంతో ఓకే చెప్పేశాను. అలా తమిళ సినిమాతో నటిగా నా ప్రయాణం మొదలైంది' అని ఆమె చెప్పుకొచ్చారు.