Mumbai: అమ్మాయి వేధించిందంటూ వీడియో తీసి, యువకుడి ఆత్మహత్య!

షార్ట్స్‌లో చూడండి
ప్రేమ పేరిట ఓ యువకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలు కోకొల్లలు. అయితే ముంబైలో మాత్రం సీన్ రివర్సయింది. ఓ అమ్మాయి తనను వేధిస్తోందని ఆరోపిస్తూ, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని రైలు కిందకు దూకాడో యువకుడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కల్యాణ్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేష్ భండారీ (22) రైల్వేల్లోనే కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో విఠల్ వాడి స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, ఆపై విచారణ ప్రారంభించిన పోలీసులు, అతని మొబైల్ లో వీడియోను గుర్తించారు. తన చావుకు ఓ యువతి కారణమని చెప్పిన రాజేష్, ఆమె పేరును వెల్లడించలేదు. తన కుమారుడిని వలలో వేసుకున్న అమ్మాయి, డబ్బు కోసం నిత్యమూ వేధిస్తుండేదని రాజేష్ తల్లి ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Go Back to Shorts
Mumbai
Selfi Video
Sucide

More Telugu News