Arvind Kejriwal: బహిరంగ సభలో రిపోర్టును చించేసిన కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ పై నిప్పులు

  • సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కొర్రీలపై ఆగ్రహం
  • ఇది పోలీస్ రాజ్యం కాదని మండిపాటు
  • బీజేపీ, ఎల్జీ సీసీటీవీలను అడ్డుకుంటున్నారని ఆరోపణ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ కు మధ్య వివాదం మరింత ముదిరింది. దేశ రాజధానిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఎల్జీ నియమించిన కమిటీ కొర్రీలు పెట్టడంతో సదరు కమిటీ సమర్పించిన ముసాయిదా నివేదికను కేజ్రీవాల్ ఓ బహిరంగ సభలో చించిపడేశారు.  ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమనీ, పోలీసు రాజ్యం కాదని మండిపడ్డారు.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన కేజ్రీవాల్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు సగం తగ్గిపోతాయన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకునేవారు పోలీస్ అధికారుల్ని సంప్రదిస్తే.. సీసీటీవీల ఏర్పాటు అవసరం ఉందో, లేదో వారు తేలుస్తారని ఎల్జీ నియమించిన కమిటీ చెప్పడం దారుణమన్నారు. అనుమతుల పేరుతో సీసీటీవీల ఏర్పాటును బీజేపీ, ఎల్జీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

More Telugu News