అత్యంత ఖరీదైన ఫోన్ ను లాంచ్ చేసిన ఎల్ జీ.. ధర లక్షకు పైనే!
- సిగ్నేచర్ 2018 ఎడిషన్ ను లాంచ్ చేసిన టెక్ దిగ్గజం
- నేటి నుంచి ప్రీ బుకింగ్స్
- మొబైల్ వాటర్, డస్ట్ ప్రూఫ్
ఫోన్ వెనుకవైపు సెన్సార్లతో కూడిన రెండు 16 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఎల్ జీ తెలిపింది. ఈ మొబైల్ లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు క్యూహెచ్ డీ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్, క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నట్లు ఎల్ జీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ను నేటి నుంచే ప్రారంభించామని పేర్కొంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ ప్రూఫ్ అని కంపెనీ తెలిపింది.