Chittoor District: నేడు 'కంగుంది' స్టయిల్... మోదీ పొగరు దించేస్తానంటున్న శివప్రసాద్!

  • పార్లమెంట్ కు రోజుకో వేషంతో వస్తున్న చిత్తూరు ఎంపీ
  • నేడు 'కంగుంది' వీధి నాటక కళాకారుడి అవతారం
  • పాటలు పాడి నిరసన తెలిపిన శివప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, రోజుకో వేషంతో పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్, నేడు కుప్పం ప్రాంతానికి సుపరిచితమైన 'కంగుంది' వీధి నాటక కళాకారుడి అవతారం ఎత్తారు.

చేతిలో కత్తి పట్టుకుని వచ్చిన ఆయన "పోరాటమున్ జేతునే... మోదీ పొగరంత దించేత్తునే... అరే పోరాటమున్ జేతునే... మోదీ పొగరంత దించేత్తునే... విభజన హామీలు నెరవేర్చే దాకా... విభజన హామీలు... విభజన హామీలు నెరవేర్చేదాకా, ప్రత్యేక హోదా ఇచ్చే దాకా... పోరాటమున్ జేతునే... మోదీ పొగరంత దించేత్తునే" అని పాటపాడారు.

"వెంకన్న సాక్షిగా మాటను ఇచ్చి... వెంకన్న సాక్షిగా మాటను ఇచ్చి... ఎగనామమూ పెట్టి వెటకారమాడివిపో... ఎందుకయ్యా మాటా ఇచ్చి తప్పినావూ మోదీ... ఇదీ ధర్మమా?... కష్టపడే చంద్రబాబును కష్టపెట్టుటా న్యాయమా?" అంటూ రాగయుక్తంగా పాటలు పాడారు.
Chittoor District
MP
Siva Prasad
Kangundi Style
Narendra Modi

More Telugu News