Karunanidhi: 'లేచిరా' అంటూ... కరుణానిధి కోసం ఇళయరాజా ప్రత్యేక పాట... నిమిషాల్లో వైరల్!

  • "లేచిరా మమ్మల్ని చూసేందుకు..." అంటున్న ఇళయరాజా
  • సోషల్ మీడియా, టీవీ చానళ్లలో హల్ చల్
  • ఆలయాల్లో అభిమానుల ప్రత్యేక పూజలు
తీవ్రమైన అనారోగ్యంతో ప్రస్తుతం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఓ ప్రత్యేక గీతాన్ని ఆలపించగా, అది నిమిషాల్లో వైరల్ అయింది.

"లేచిరా మమ్మల్ని చూసేందుకు..." అంటూ సాగే ఈ పాట ఇప్పుడు తమిళనాట సోషల్ మీడియాతో పాటు టీవీ చానళ్లలో హల్ చల్ చేస్తోంది. ఇదిలావుండగా, కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు వీఐపీలు వచ్చి వెళుతున్నారు.
Karunanidhi
Ilayaraja
Special Song
viral
Tamilnadu

More Telugu News