Telugudesam: టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది: విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ భూ స్కాంపై బీజేపీయే ఒత్తిడి చేసి సిట్ వేయించిందని, ఈ కుంభకోణంలో టీడీపీ నేతల బండారం బయటపడుతుందని ఆ నివేదికను బయటపెట్టడం లేదని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్ పై ప్రజలను టీడీపీ తప్పుదారి పట్టిస్తోందని, అన్నా క్యాంటీన్ లో రూ.5కే భోజనం ఎలా సాధ్యమో, రైల్వేజోన్ ఏర్పాటు కూడా అలాగే సాధ్యమని అన్నారు. టీడీపీ మొదటి నుంచీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, విశాఖ రైల్వేజోన్ సాధ్యం కాకున్నా ఇచ్చేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. రాజ్యసభలో మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పిన తర్వాత, కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ మాటకు అంత విలువ ఉండదని, రాజకీయ నిర్ణయంగానే రైల్వేజోన్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Telugudesam
bjp
vishnu kumar raju

More Telugu News