KCR: చానాళ్ల తరువాత కేసీఆర్, ఉత్తమ్ కుమార్ కరచాలనం, నమస్కారం!

  • ఉజ్జయిని మహంకాళి ఆలయానికి కేసీఆర్
  • అప్పటికే ఆలయంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • పలకరించుకున్న ఇరువురు నేతలు
చాలా రోజుల తరువాత... తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. పరస్పరం కరచాలనం చేసుకుని నమస్కరించుకున్నారు. అసెంబ్లీలో మినహా, వీరిద్దరూ బయట కలుసుకునే సందర్భాలు బహు తక్కువేనన్న సంగతి అందరికీ తెలిసిందే.

నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా కేసీఆర్, అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన వేళ, ఈ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. అప్పటికే ఆలయంలో ఉత్తమ్ కుమార్ ఉన్నారు. ఆలయ గర్భగుడి వెలుపల ఉత్తమ్ ను చూడగానే కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై నమస్కారం చేశారు. ఆపై కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లారు.
KCR
Uttam Kumar Reddy
Bonalu
Mahankali
Secunderabad

More Telugu News