Samanta: ఈ ఫొటో ఎలా లీకైందో తెలియదు: సమంత ఫన్నీ రిప్లయ్

  • ఓ యువకుడితో సమంత పెళ్లి అయినట్టు మార్ఫింగ్ ఫొటో
  • దాన్ని చూసి స్పందించిన సమంత
  • గత వారమే పారిపోయామంటూ వ్యాఖ్య
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే సమంత, తనకు ట్విట్టర్ ఖాతాలో కనిపించిన ఓ ఫొటోపై తనదైన శైలిలో ఫన్నీగా స్పందించింది. ఓ యువకుడు సమంతను పెళ్లి చేసుకున్నట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోను 'అల్లు అర్జున్ అడిక్ట్' అనే ట్విట్టర్ ఖాతా పోస్టు చేస్తూ, "ఏంటిది?" అన్న కామెంట్ పెట్టింది.

ఇది అలా ఇలా తిరిగి సమంత వరకూ చేరింది. ఆపై స్పందించిన సమంత "గత వారమే మేమిద్దరమూ పారిపోయాం. ఈ ఫొటో ఎలా లీక్ అయిందో. మాది తొలి చూపు ప్రేమ" అని చమత్కరిస్తూ సరదాగా రిప్లయ్ ఇచ్చింది. ఈ రెండు ట్వీట్ లూ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Samanta
Twitter
Marriage
Marfing Pic
Funny Reply

More Telugu News