ఇటు ప్రియుడిని మరువలేక, అటు తల్లిదండ్రుల పరువు తీయలేక... తనువు చాలించిన యువతి!

  • హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఘటన
  • కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు
  • ఆత్మహత్య చేసుకుని మరణించిన సుష్మ
ప్రేమించిన వాడిని వదిలి ఉండలేక, పారిపోయి పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల పరువు తీయలేక సతమతమైన ఓ యువతి, తన ప్రాణాలు తీసుకోవాలన్న సంచలన నిర్ణయం తీసుకుని, కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీకి చెందిన సుష్మ (23) ఉప్పర గూడకు చెందిన సంతోష్ కుమార్ యాదవ్ (25)తో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది.

 ఈ విషయం సుష్మ తల్లిదండ్రులకు తెలియడంతో గొడవలు కూడా అయ్యాయి. కులాలు వేరువేరన్న కారణంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో సుష్మ బంధువుల ఫిర్యాదు మేరకు షీ టీమ్స్ బృందం సంతోష్ కు కౌన్సెలింగ్ కూడా ఇచ్చింది. సుష్మను వదులుకోలేని సంతోష్, గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో సుష్మ, కుటుంబం పరువు పోతుందన్న మనస్తాపంతో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Hyderabad
Police
Sucide
Sushma

More Telugu News