paruchuri gopalakrishna: విలన్స్ ను చంపకుండా వదిలేయడం ఆడియన్స్ కి నచ్చలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • అసలు కథ ఆలస్యంగా మొదలవుతుంది 
  • సోనాలీ బింద్రే పాత్ర పరంగా అదొక మైనస్
  • విలన్స్ ను వదిలేయడంతో అసంతృప్తి     

'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాకి సంబంధించిన విషయాలను గురించి, ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమం ద్వారా పరుచూరి గోపాలకృష్ణ  పంచుకున్నారు. "పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ప్రేక్షదరణ పొందకపోవడానికి కొన్ని కారణాలు వున్నాయి. అసలు కథ చాలా సేపటివరకూ మొదలు కాకపోవడమనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక సోనాలి బింద్రే వంటి అందమైన కథానాయికను హీరో పెళ్లి చేసుకోకుండా, ఇంకొకరిని పెళ్లి చేసుకోమని ఆయనే చెప్పడం మరో కారణమనుకోవచ్చు.

ఈ విషయం గురించి ఆదిలోనే మేము బాగా ఆలోచించినా, పూర్తి కథ దెబ్బతింటుందేమోననే ఉద్దేశంతో మార్చలేదు. ఇక కుమారదాసు చావుకు కారణమైన విలన్లను చంపకుండా బాలకృష్ణ  వదిలేయడం కూడా ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించింది. ఏ కథలోనైనా చేయవలసిన మార్పులు చేయకుండా .. చేయకూడని మార్పులు చేస్తే కనుక కథ దెబ్బ తింటుందనడానికి ఇదే నిదర్శనం" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News