stalin: పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ అత్యవసర సమావేశం

షార్ట్స్‌లో చూడండి
డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ చెన్నయ్, గోపాలపురంలోని తన నివాసంలో అత్యవసరంగా సమావేశం అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా 50వ సంవత్సరంలోకి ప్రవేశించిన కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. గోపాలపురంలోని కరుణానిధి నివాసం వద్దకు కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ తమ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఓపక్క ఇప్పటికే తండ్రి ఆరోగ్యంపై స్టాలిన్ స్పందిస్తూ ఓ ప్రకటన చేశారు. కరుణానిధి కోలుకుంటున్నారని, నిన్నటితో పోలిస్తే జ్వరం, ఇన్ ఫెక్షన్ తగ్గాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Go Back to Shorts
stalin
dmk

More Telugu News