ఆకట్టుకుంటోన్న 'బ్రాండ్ బాబు' ట్రైలర్
- మారుతి అందించిన కథ
- కోటీశ్వరుడి తనయుడిగా హీరో
- పనిమనిషిగా హీరోయిన్
ఓ శ్రీమంతుడి తనయుడు .. అందునా ప్రతి విషయంలో తనస్థాయికి తగినట్టుగా నంబర్ వన్ 'బ్రాండ్'కి ప్రాముఖ్యతనిచ్చే హీరో .. ఒక పనిమనిషి ప్రేమలో పడటమే ప్రధాన ఇతివృత్తమని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేదిలా వుంది. హీరో తండ్రిగా మురళీ శర్మ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే విషయం ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.