Pakistan: పాకిస్థాన్ ఎన్నికల్లో ఘనమైన రికార్డును సొంతం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్

  • ఐదు స్థానాల నుంచి పోటీ చేసిన ఇమ్రాన్ ఖాన్
  • అన్ని చోట్లా గెలుపొంది చరిత్ర పుటల్లోకి కెప్టెన్
  • రావల్పిండిలో తిరుగులేని పీఎంఎల్ ను చిత్తు చేసిన ఇమ్రాన్

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఎవరూ సాధించలేని ఘనతను సాధించారు. 'నయా పాకిస్థాన్' నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లను సాధించారు. ఈ క్రమంలో తాను పోటీ చేసిన ఐదు స్థానాల్లో నెగ్గి రికార్డుపుటల్లోకి ఎక్కారు. ఎన్ఏ-26 బన్ను, ఎన్ఏ-61 రావల్పిండి, ఎన్ఏ-95 మియావలి, ఎన్ఏ-131 లాహోర్, ఎన్ఏ-243 కరాచీ  స్థానాల్లో పోటీ చేసిన ఆయన... అన్ని స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో, రావల్పిండిలో తిరుగులేని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ ను ఆయన చిత్తుగా ఓడించారు. 

More Telugu News