నేను బృంద నాయకుడిని మాత్రమే.. క్రెడిట్ మీదే: చంద్రబాబు

  • వృద్ధిరేటులో ఏపీ నెంబర్ వన్
  • అధికారులకు సత్కారం
  • అవార్డులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్న సీఎం
వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిర్దేశించిన 2022 కంటే ముందుగానే అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులు సాధించిన 300 మంది అధికారులను చంద్రబాబు సత్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. నాలుగేళ్లు రాత్రీపగలు కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రం గాడిలో పడిందన్నారు. అవార్డుల ద్వారా గుర్తింపు వస్తుందని, గుర్తింపు వల్ల ఉత్సాహం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. తాను బృంద నాయకుడిని మాత్రమేనని, ఈ క్రెడిట్ మొత్తం బృందానికే దక్కుతుందన్నారు. అవార్డులు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగాలని అధికారులకు సీఎం సూచించారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Amaravathi
Awards

More Telugu News