saidharam tej: నెక్స్ట్ మూవీ కోసం లుక్ మార్చేస్తోన్న సాయిధరమ్ తేజ్

  • వరుసగా ఎదురవుతోన్న పరాజయాలు
  • సక్సెస్ కోసం తపిస్తోన్న తేజు 
  • కిషోర్ తిరుమలతో నెక్స్ట్ మూవీ  
వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. తరువాత చేసే సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం ఆయన కథా కథనాల విషయంలోనే కాదు, తన లుక్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నాడు. దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే పనులను మొదలెట్టారు కూడా.

 అయితే ఈ సినిమాలో తాను న్యూ లుక్ తో కనిపించనున్నాననీ .. అందుకు ఒక మూడు నెలల సమయం కావాలని తేజు అడిగాడట. అందుకు దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పారని సమాచారం. ఈ కారణంగా ఈ సినిమా ఆగస్టులో కాకుండా, నవంబర్ లో గానీ డిసెంబర్లో గాని మొదలుకానుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే తేజు ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.     
saidharam tej

More Telugu News