Pawan Kalyan: పవన్ పై జగన్ వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • జగన్ మాట్లాడింది తప్పు.. దీంట్లో రెండో ఆలోచన లేదు 
  • ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు
  • పవన్ కి ఎంతమంది పెళ్లాలున్నారనేది ఆ పెళ్లాలే తేల్చుకోవాలి
పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ లో ఈ విషయమై ప్రస్తావించగా ఉండవల్లి మాట్లాడుతూ, ‘పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియో నేను చూడలేదు.. పేపర్ లో చూశా. ఇది చాలా తప్పు. ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పును నువ్వు తప్పనుకుంటే దానిని ఎదుర్కోవడానికి లీగల్ పద్ధతులు ఉన్నాయి.

లీడర్ ఎప్పుడూ మార్గదర్శకుడిగా ఉండాలి. తప్పు చేస్తే..తప్పు చేస్తున్నావు, ఇలా చేయొద్దని చెప్పాలి. జగన్ మాట్లాడినట్టుగా పేపర్ లో ఏదైతే వచ్చిందో..అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు. దీంట్లో రెండో ఆలోచన లేదు. పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలి తప్ప నీకూ నాకూ సంబంధం లేదని మన చట్టం చెబుతుంది. ఏ పెళ్లాన్ని అయితే ఇబ్బంది పెట్టారో ఆ పెళ్లాం కోర్టుకు వెళ్లొచ్చు. అంతేకానీ, మనకేమీ కామెంట్ చేసే అధికారం లేదు’ అని అన్నారు.

‘జగన్ ఎందుకిలా మాట్లాడుతున్నారు?' అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఉండవల్లి స్పందిస్తూ, ‘జగన్ ఎందుకిలా చేశాడనేది చెప్పడానికి నాకు జ్యోతిష్య శక్తి లేదు. ఆ రకమైన వ్యాఖ్యలు చేసుకోవడం ఆ పార్టీకి గానీ, ఈ పార్టీకి గాని మంచిది కాదు’ అన్నారు.
Pawan Kalyan
undvalli

More Telugu News