ముస్లిం యజమాని కూతుర్ని ప్రేమించిన పనివాడు... కొట్టి చంపిన వైనం!
- రాజస్థాన్ లోని జైపూర్ లో ఘటన
- ముస్లిం యువతితో స్నేహం చేసిన పనివాడు
- పొలానికి తీసుకెళ్లి కొట్టి చంపిన వైనం
- ఇద్దరిని అరెస్ట్ చేశామన్న పోలీసులు
పొలానికి రావాలని ఇంట్లో ఉండే హయత్ ఖాన్, సదామ్ ఖాన్ లు కేత్ రామ్ ను పిలిచారని, అప్పటికే పొలంలో ఉన్న మరికొందరితో కలసి అతని చేతులు కట్టేసి దారుణంగా కొట్టి చంపారని హరిరామ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో సైతం దారుణమైన గాయాల కారణంగా కేత్ రామ్ మరణించినట్టు తేలడంతో, ఇద్దరు నిందితులనూ అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.