విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు.. చితక్కొట్టిన తల్లిదండ్రులు
Add ap7am to your home Screen

విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు.. చితక్కొట్టిన తల్లిదండ్రులు

  • రోజూ అశ్లీల చిత్రాలు చూపిస్తున్న హెడ్మాస్టర్
  • స్కూలుకొచ్చి దాడి చేసిన తల్లిదండ్రులు
  • అదుపు చేసిన పోలీసులు
విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్న ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్లలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రతీ రోజు తమకు తన సెల్‌ఫోన్‌లోని అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడంటూ 4,5 తరగతుల విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు స్కూలుకు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం ఉపాధ్యాయుడు రాజును పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న ఎంఈవో బుచ్చానాయక్ పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి స్కూలు వద్ద పరిస్థితిని అదుపు చేశారు.

హెడ్మాస్టర్ రాజు మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను కొట్టి పడేశారు. పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తుండడంతో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని అన్నారు. కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరినందుకు తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని పేర్కొన్నారు. తన గురించి బాలికల తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు.
Telangana
Medak District
School
teacher

More Telugu News